బస్థర్ , 8 జూలై (హి.స.)ఛత్తీస్‌గఢ్ బస్థర్ లో 31 మార్చి 2026 వరకు మావోయిస్ట్ లను అంతమొందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే భద్రతబలగాలు హిడుమ.. బార్సే దేవను బలగాలు చుట్టుముడుతున్న.. తప్పించుకుంటున్నారని అనుక్షణం వాళ్ళ లొకేషన్ మారుతుందని అయినప్పటికీ వాళ్లు తమ కనుసన్నల్లోనే ఉన్నారని వారు ఇరువురిని లొంగిపోవాలని లేనిపక్షంలో వారికి చావు తప్పదని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్, ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతాల్లో అలాగే నేషనల్ పార్క్ ఏరియాల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. గత కొద్ది రోజులుగా ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ జాతీయ సెక్రటరీ నంబాల కేశవరావును అంతమొందించిన అనంతరం.. నేషనల్ పార్క్ ఏరియాలో మరి కొంతమంది ముఖ్య నాయకులను హతమార్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ