బీజాపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
చతిస్గడ్, 12 సెప్టెంబర్ (హి.స.) ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు మావోస్టులు మరణించారు. బీజాపూర్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్ట
ఎన్కౌంటర్


చతిస్గడ్, 12 సెప్టెంబర్ (హి.స.)

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు మావోస్టులు మరణించారు. బీజాపూర్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోస్టులు తారపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల ఫైరింగ్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో 303 రైఫిల్తోపాటు ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో కాలులు ఇంకా కొనసాగుతున్నాయని, మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande