గ్యాల్సింగ్, 12 సెప్టెంబర్ (హి.స.)
ఈశాన్య రాష్ట్రం సిక్కిం లో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.గ్యాల్సింగ్ జిల్లాలోని అప్పర్ రింబి లో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ సిక్కింలోని యాంగ్గాంగ్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. హ్యూమ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిపై చెట్టు దుంగతో తాత్కాలిక వంతెనను నిర్మించింది. ఆ వెంతన ద్వారానే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు