శ్రీవారి సేవలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమలకు విచ్చేసి.. స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శి
నిర్మల సీతారామన్


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమలకు విచ్చేసి.. స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత టీటీడీ అడిషినల్ ఈఓ వెంకయ్య చౌదరి నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. వెంకయ్య చౌదరి ఆమెకు తీర్థ ప్రసాదాలను అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande