భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి.. నిజామాబాద్ కలెక్టర్
తెలంగాణ, నిజామాబాద్. 16 సెప్టెంబర్ (హి.స.)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సాలూర తహసీల్దార
నిజామాబాద్ కలెక్టర్


తెలంగాణ, నిజామాబాద్. 16 సెప్టెంబర్ (హి.స.)ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను తహసీల్దార్ వై.వి.శశిధర్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande