తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 16 సెప్టెంబర్ (హి.స.)
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వెళ్లే రహదారిని రైతులు దిగ్బంధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల స్టేజి వద్ద రహదారిపై మంగళవారం ఉదయమే భూ నిర్వాసితులు బైఠాయించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ పొట్టలు కొట్టేలా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఉన్నదని దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమపై దయ తలచి పూర్తిగా వ్యవసాయ భూముల్లో నుంచి వెళ్తున్న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ తక్షణమే మార్చేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు