రాజీనామా, పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ, 18 సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని లేదా కొత్త పార్టీ పెడుతున్నానని జరుగుతున్న ప్రచారం వాస్తవ
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి


తెలంగాణ, 18 సెప్టెంబర్ (హి.స.)

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని లేదా కొత్త పార్టీ పెడుతున్నానని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. “మా కుటుంబం ఎప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ నేపథ్యమే ఉన్న కుటుంబం. నాకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది. కానీ నాకు, మా కుటుంబానికి గిట్టని కొందరు వ్యక్తులు కావాలనే ఈ రకాల ప్రచారం చేస్తున్నారు. మా ప్రతిష్ట దిగజార్చేందుకే ఈ రూమర్లు సృష్టిస్తున్నారు” అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తన వ్యాఖ్యలు ఉంటాయని, తన రాజకీయ భవిష్యత్తుపై తాను చెప్పకపోతే ఇతరుల మాటలను ఎవరు నమ్మొద్దని ఆయన హితవు పలికారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande