రాను 3 గంటల్లో పాలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం
అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: రానున్న 3 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని
రాను 3 గంటల్లో పాలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం


అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి: రానున్న 3 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే వీలుందని వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉండి అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande