తెలంగాణ, మహబూబ్నగర్. 18 సెప్టెంబర్ (హి.స.)
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్
మండలం భవాని తండా వద్ద గురువారం మధ్యాహ్నం రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మరణించగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వనపర్తి జిల్లా గణపురం మండలం నుంచి ప్రయాణికులను తీసుకొని మహబూబ్ నగర్ వెళుతున్న ఆటో భవాని తండా వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో గట్టు కాడుపల్లి గ్రామానికి చెందిన వంశీ (24), మరో యువకుడు అక్కడికక్కడే మరణించారు. మానాజీపేటకు చెందిన సక్రి అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించి సంఘటనపై వివరాలను సేకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు