ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.) ఆత్మగౌరవం కోల్పోయిన తరువాత వచ్చే ఏ పదవైనా గడ్డి పోచతో సమానం అని తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలా విసిరి వేశామనీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 20 ఏళ్ళల్లో 4 సార్లు ఎమ్మెల్యే కా
ఈటెల రాజేందర్


హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)

ఆత్మగౌరవం కోల్పోయిన తరువాత వచ్చే ఏ పదవైనా గడ్డి పోచతో సమానం అని తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలా విసిరి వేశామనీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 20 ఏళ్ళల్లో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 6 సార్లు అయ్యాం. మాకు ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలని కొట్లాడామని అన్నారు. ఇవాళ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తులు కాదని విలువలు-సాంప్రదాయాలు ఇవ్వాలన్నారు. దేశభక్తి నేర్పించాలన్నారు. ఈరోజుల్లో వస్తున్న వార్తలు కలచి వేస్తున్నాయని కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన పిల్లలను, సొంత భర్తను చంపుతున్నారు. వీటి నుండి కాపాడేది మన విలువలే. ఎక్కడో జరుగుతున్నాయని అనుకోవద్దని అది మీ గడపను కూడా తడుతుందని హెచ్చరించారు. అందువల్ల పిల్లలను జాగ్రత్తగా పెంచాలని సూచించారు.

మహనీయుల విగ్రహాలను పెట్టుకోవడం.. జయంతులు, వర్ధంతులు చేసుకోవడం కేవలం ఒక దండ వేసుకోవడానికే మాత్రమే కాదు వారి చరిత్ర భావితరాలకు అందించడం కోసం అని చెప్పారు. నిన్న ఎగురవేసుకున్న జాతీయ జెండా తెలంగాణ ప్రజల రక్త తర్పణాన్ని గుర్తు చేసింది. భారత స్వాతత్రం కోసం లక్షల మంది పోరాటాలు చేశారు, ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande