తెలంగాణ, మెదక్. 18 సెప్టెంబర్ (హి.స.)
విద్యార్థుల సామర్ధ్యాన్ని వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మెదక్ రూరల్ మండలంలోని మంబోజి పల్లి పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న పరిసరాలను, వంటశాలను, వాటర్ సౌకర్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న అనేక రకాల శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు