ఎంపీ హోదాలో వివరాలు అడిగితే సమాధానం చెప్పరా? పెద్దపల్లి కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
తెలంగాణ, పెద్దపల్లి. 18 సెప్టెంబర్ (హి.స.) పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ శ్రీహర్షపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరి పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్ పోర్ట్ వివరాలు అడిగితే నా దగ్గర లేవు
పెద్దపల్లి ఎంపీ


తెలంగాణ, పెద్దపల్లి. 18 సెప్టెంబర్ (హి.స.)

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా

కలెక్టర్ శ్రీహర్షపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరి పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి, ఎయిర్ పోర్ట్ వివరాలు అడిగితే నా దగ్గర లేవు అనే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం మెసేజ్ లు చేసిన రిప్లై ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ శ్రీహర్ష పై ఎంపీ వంశీ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిస్తే ఎందుకు స్పందించడం లేదని ఎంపీ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రశ్నించారు. రామగుండం ఎయిర్ పోర్ట్, ఈఎస్ఐ ఆస్పత్రి వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ హోదా లోనే వివరాలు అడిగితే ఇవ్వలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నికైన నేను ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాసేవ చేసేందుకే ఎంపీగా ఉన్నానని కలెక్టర్ పై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలనేది రిక్వెస్ట్ కాదని కలెక్టర్ గా మీ బాధ్యత అని గుర్తుకు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande