రికార్డ్ స్థాయిలో గోల్డ్, సిల్వర్ ధరలు
ముంబయి,22, సెప్టెంబర్(హి.స.) సోమవారం తులం గోల్డ్‌ ధరపై రూ.430 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బంగారం ప్రియులు వామ్మో.. అంటూ గుండె మీద చేయి వేసుకుంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.430 పెరగడంతో రూ.1, 12, 580 దగ్గర
Gold rate increased


ముంబయి,22, సెప్టెంబర్(హి.స.) సోమవారం తులం గోల్డ్‌ ధరపై రూ.430 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బంగారం ప్రియులు వామ్మో.. అంటూ గుండె మీద చేయి వేసుకుంటున్నారు.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.430 పెరగడంతో రూ.1, 12, 580 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరగడంతో రూ.1, 03, 200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 పెరగడంతో రూ.84,440 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరగడంతో రికార్డ్ స్థాయిలో రూ. 1,38, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,48,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,38, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande