న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.) రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు మన ఎగుమతులపై అమెరికా 50శాతం సుంకాల భారం (Trump Tariffs) వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు భారత్ నేరుగా స్పందించలేదు. ఈ విషయమై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh)కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘అవును ప్రభుత్వం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. విశాల దృక్పథం, గొప్ప మనసు ఉన్నవారు ఏ విషయంపైనైనా వెంటనే స్పందించరు’’ అని బదులిచ్చారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు