ఏపీ సర్కారుకు భారీ ఊరట.. ‘విజయవాడ ఉత్సవ్’‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ, 22 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. దుర్గ గుడి ఆలయ భూముల్లో ‘విజయవాడ ఉత్సవ్’ (Vijayawada Utsav) నిర్వహణపై వైసీపీ (YCP) నేతలు ఇటీవలే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట
ఏపీ సర్కారుకు భారీ ఊరట.. ‘విజయవాడ ఉత్సవ్’‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్


ఢిల్లీ, 22 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. దుర్గ గుడి ఆలయ భూముల్లో ‘విజయవాడ ఉత్సవ్’ (Vijayawada Utsav) నిర్వహణపై వైసీపీ (YCP) నేతలు ఇటీవలే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వాఖ్యలు చేసింది. పిటిషనర్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ‘విజయవాడ ఉత్సవ్’ నిరభ్యతరంగా నిర్వహించుకునేందుకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, అట్టహాసంగా ఉత్సవ్‌‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 286 ఈవెంట్స్‌తో వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఫెస్టివ్‌ కార్నివాల్‌ను హోస్ట్ చేయనున్నారు. కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు, డ్రోన్‌ షోలతో పాటు వివిధ ఆసక్తికర కార్యక్రమాలతో ‘విజయవాడ ఉత్సవ్’ సిద్ధమైంది. అదేవిధంగా ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు స్పెషల్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande