అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.):అల్లూరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ప్రభావంతో అల్లూరి జిల్లాలో కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి. దాదాపు 40 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు నాటుపడవలు పైనే ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి. మిర్చి పంట వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కాజ్ వేలు, రహదారులు నీటమునిగాయి. నాటుపడవలుపైనే లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ