అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ