
అమరావతి, 14 జనవరి (హి.స.) :రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 1సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి సౌభాగ్యాన్ని అందించాలని సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనగానే మన మదిలో మెదిలేది.. భోగి మంటలు, గంగిరెద్దులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, సంప్రదాయ పందేలు, కొత్త దుస్తులు, పిండి వంటలు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రశాంతత వెల్లివిరుస్తోందన్న సంగతిని వేరే ప్రస్తావించవలసిన అవసరం లేనేలేదని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ