జాతరకు వచ్చే భక్తులు మై మేడారం చాట్ బర్డ్ సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి సీతక్క
తెలంగాణ, 14 జనవరి (హి.స.) మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు మేడారంలో కల్పించిన సౌకర్యాలు ఇతర విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ మై మేడారం బర్డ్ వాట్సప్ను ఉపయోగించుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి డాక
మంత్రి సీతక్క


తెలంగాణ, 14 జనవరి (హి.స.)

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు మేడారంలో కల్పించిన సౌకర్యాలు ఇతర విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ మై మేడారం బర్డ్ వాట్సప్ను ఉపయోగించుకోవాలని, జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. మేడారం మహా ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు ప్రతి ఒక్కరు మేడారం రావాలని ఆమె పిలుపు నిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలసి మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మహా జాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులతో పాటు 101 కోటి రూపాయలతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని, ఎలాంటి లోటు పాట్లు ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులను తిరిగి వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా చేరవేయడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande