ప్రజాస్వామ్యంపై దాడి : సంగారెడ్డి ఎమ్మెల్యే
సంగారెడ్డి, 14 జనవరి (హి.స.) జర్నలిస్టులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఒక కథనం ప్రసారం చేసిన కారణంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కార్
సంగారెడ్డి ఎమ్మెల్యే


సంగారెడ్డి, 14 జనవరి (హి.స.)

జర్నలిస్టులను అరెస్టు చేయడం

ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఒక కథనం ప్రసారం చేసిన కారణంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కార్ పాలనలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలను ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు పెట్టి, అరెస్టులు చేయడం దుర్మార్గమైన పాలనకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియాను భయపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోరాటాలు తప్పవని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande