నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రూపాయి విలువ మరింత పతనం!
హైదరాబాద్, 14 జనవరి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల జోరుతో ఈ రోజు Stock markets నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు నష్టపోయి 83,382 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ
స్టాక్ మార్కెట్లు


హైదరాబాద్, 14 జనవరి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న

అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల జోరుతో ఈ రోజు Stock markets నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు నష్టపోయి 83,382 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,690 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఆటో రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించగా, టీసీఎస్, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 2 శాతం మేర క్షీణించాయి. అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్ హెచ్చరికలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.

మరోవైపు, దేశీయ కరెన్సీ రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే మరింత బలహీనపడి 90.29 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరువలో ముగిసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande