ట్రంప్ దావోస్ పర్యటన.. విమానానికి తప్పిన భారీ ప్రమాదం
దావోస్, 21 జనవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటనకు బయల్దేరిన విమానానికి భారీ ప్రమాదం తప్పింది. దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయల్దేరగా.. అందులో సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు 680 కిలోమీటర్లు
america-president-trumps-flight-to-davos-returns-midair-5160


దావోస్, 21 జనవరి (హి.స.)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటనకు బయల్దేరిన విమానానికి భారీ ప్రమాదం తప్పింది. దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయల్దేరగా.. అందులో సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు 680 కిలోమీటర్లు ప్రయాణించిన విమానం.. సాంకేతిక లోపం కారణంగా వెనుదిరిగింది. మేరీల్యాండ్ లోని బేస్ ఆండ్రూస్ లో తిరిగి ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో స్మాల్ ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చిందని, అందుకే యూ టర్న్ తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విమానం టేకాఫ్ అయ్యాక ప్రెస్ క్యాబిన్లో లైట్లు కొద్దిసేపు ఆరిపోయినట్లు ఆ ఫ్లైట్లో ప్రయాణించిన విలేకరి ఒకరు తెలిపారు. వైట్ హౌస్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ సమస్యను విమానం టేకాఫ్ చేసిన కొద్దిసేపటి తర్వాత గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే ట్రంప్ మరో విమానంలో దావోస్ పర్యటనకు బయల్దేరినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande