
ఫుకెట్, 16 నవంబర్ (హి.స.)
థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. పటాంగ్ ప్రాంతంలో ఓ వాణిజ్య భవనంలో చెలరేగిన మంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయాలపాలయ్యారు.
వాహనాలు అద్దెకు ఇచ్చే వ్యాపారం నడిచే ఆ భవనంలో తెల్లవారుజామున 3.17 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడి పక్క భవనాలకు కూడా వ్యాపించాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
గాయపడిన వారిలో 15 మంది థాయ్‌లాండ్‌కు చెందిన వారు కాగా, ఒకరు మయన్మార్ జాతీయుడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఏ పర్యాటకుడూ మరణించలేదని, గాయపడలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఫుకెట్ పశ్చిమ తీరంలో ఉన్న ఫేమస్ పటాంగ్ బీచ్‌కు దగ్గరలోనే ఈ భవనం ఉంది. ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు