బంగ్లాదేశ్లో మళ్లీ భగ్గుమన్న హింస: ఎంపీ ఇల్లు, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్కు నిప్పు.. కృషక్ దళ్ నేత దారుణ హత్య
బంగ్లాదేశ్లో మళ్లీ భగ్గుమన్న హింస: ఎంపీ ఇల్లు, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్కు నిప్పు.. కృషక్ దళ్ నేత దారుణ హత్య
bangladesh


ఢాకా, 18 నవంబర్ (హి.స.)

బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. మంగళవారం రాత్రంతా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీరంగం సృష్టించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృషక్ దళ్ (Krishak Dal) పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడిని దుండగులు దారుణంగా హత్య చేయడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి.

ఈ హత్యకు నిరసనగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు పలుచోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ పార్లమెంటు సభ్యుడి (ఎంపీ) నివాసంతో పాటు, స్థానిక పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, రోడ్డుపై నిలిపి ఉంచిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన అల్లరి మూకలు, లాకప్‌లో బంధించి ఉన్న ఖైదీలను బలవంతంగా విడిపించుకుని తీసుకెళ్లాయి.

రాత్రంతా కొనసాగిన ఈ దాడులు, దహనకాండతో ఆయా ప్రాంతాల్లో భయానక వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున అదనపు భద్రతా బలగాలను, ఆర్మీని రంగంలోకి దించింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు, విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande