భారత స్టార్ షట్లర్ PV సింధు అరుదైన ఘనత
హైదరాబాద్, 22 జనవరి (హి.స.) భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించారు. డెన్మార్క్ షట్లర్ ఫో లినే జేర్ఫీల్డ్ను సింధు ఓడించారు. ఈ విజయంతో అంతర్జాతీయ కెరీర్లో
PV సింధు


హైదరాబాద్, 22 జనవరి (హి.స.)

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించారు. డెన్మార్క్ షట్లర్ ఫో లినే జేర్ఫీల్డ్ను సింధు ఓడించారు. ఈ విజయంతో అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 500 మ్యాచ్లో విజయాలు సాధించిన తొలి భారతీయ షట్లర్గా సింధు నిలిచారు. బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్ ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్గా సింధు నిలిచారు. భారత్ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే కావడం విశేషం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande