చివరి ప్రయత్నంలోను బంగ్లాదేశకు బిగ్ షాక్
హైదరాబాద్, 24 జనవరి (హి.స.) త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న BCB విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడే ప్రసక్తే లేద
బంగ్లా క్రికెట్


హైదరాబాద్, 24 జనవరి (హి.స.)

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ

కప్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలన్న BCB విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కోలుకోలేని దెబ్బ కొట్టింది. అనంతరం బంగ్లాదేశ్ చివరి ప్రయత్నంగా.. ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిన్న ఐసీసీ వివాద పరిష్కార కమిటీని (DRC) ఆశ్రయించింది. కానీ అక్కడ కూడా బంగ్లాదేశ్కు తీవ్ర పరాభవం ఎదురైంది. ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేసే అధికారం తమకు లేదని, ఈ అప్పీల్ తమ పరిధిలోకి రాదని DRC స్పష్టం చేస్తూ బంగ్లాదేశ్ పిటిషన్ను తోసిపుచ్చింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande