
ముంబై, 22 జనవరి (హి.స.)బంగారం, వెండి ధరలు ఊరటనిచ్చాయి. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. బుధవారం ఒకేసారి తులం బంగారంపై రూ.6 వేలు పెరగ్గా.. నేడు గురువారం రిలీఫ్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం నుంచి ధరలు అసలు తగ్గనే తగ్గడం లేదు. బుధవారం ఒక్కసారిగా రూ.6 వేల మేర పెరిగి షాకిచ్చింది. నిన్నటితో పోలిస్తే గురువారం కాస్త స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అటు బంగారంతో పాటు వెండి ధర కూడా ఆమాంతంగా పెరుగుదల నమోదు చేస్తోంది. గురువారం వివిధ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు ప్రాంతాల వారీగా..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,610 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,56,600 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,43,560 వద్ద కొనసాగుతోంది. దీని ధర నిన్న రూ.1,43,550గా ఉంది.
-విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,56,610 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,560గా ఉంది.
------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV