భోజ్ శాల లోపూజలు, ప్రార్థనల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ, 22 జనవరి (హి.స.) మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్ శాల పరిసరాల్లో పూజల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వసంత పంచమి వేడుకలు, శుక్రవారం నమాజ్ ఒకేరోజు రావడంతో తలెత్తిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరు వర్గా
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 22 జనవరి (హి.స.)

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్ శాల పరిసరాల్లో పూజల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వసంత పంచమి వేడుకలు, శుక్రవారం నమాజ్ ఒకేరోజు రావడంతో తలెత్తిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరు వర్గాలకు సమయాన్ని కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వసంత పర్వదినాన్ని పురస్కరించుకుని భోజ్ శాల ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు హిందూ సమాజానికి కోర్టు అనుమతినిచ్చింది. సూర్యోదయం పంచమి నుంచి సూర్యాస్తమయం వరకు వసంత పంచమి పూజలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదేవిధంగా ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande