
హైదరాబాద్, 27 జనవరి (హి.స.) ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (Social Media)ను నిషేధించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన ఓటింగ్లో ఫ్రాన్స్ దిగువ సభ ఈ బిల్లును 116-23 ఓట్ల తేడాతో ఆమోదించింది. సైబర్ బెదిరింపులు (Cyberbullying), 2, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి పిల్లలను రక్షించడమే ఉద్దేశంగా ఈ బిల్లు రూపొందించారు. అయితే, 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ను క్రియేట్ చేయడం చట్టవిరుద్ధమని ఈ బిల్లు చెబుతోంది.
సోషల్ మీడియాతో పాటు, హైస్కూళ్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..