
హైదరాబాద్, 29 జనవరి (హి.స.)
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆ దేశ శాసనసభ్యుడు డియోజీనెస్ క్వింటరోతో సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఇద్దరు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. కుకుటలోని ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 9 నిముషాల్లోనే కాంటాక్ట్స్ కట్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు