
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,08జనవరి (హి.స.)అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో ఈడీ దాడులకు దిగింది. ఐపీఏసీ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఈడీ దాడుల వార్తలు కలకలం రేపడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ దాడులు నిర్విస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి తరుణంలో నేరుగా మమతా బెనర్జీ రంగంలోకి దిగడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఫైటింగ్‌గా మారింది. ప్రస్తుతం కోల్‌కతాలో టెన్షన్ వాతావరణం నెలకొంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ