విశాఖలో భారీ బంగారం స్మగ్లింగ్ ప్లాన్ను భగ్నం... ఇద్దరు అరెస్ట్
విశాఖపట్నంలో భారీ బంగారం స్మగ్లింగ్ ప్లాన్ను డీఆర్ఐ అధికారులు భగ్నం చేశారు. స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Arrest


అమరావతి, 11 అక్టోబర్ (హి.స.)విశాఖపట్నంలో భారీ బంగారం స్మగ్లింగ్ ప్లాన్ను డీఆర్ఐ అధికారులు భగ్నం చేశారు. స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కోల్కతా నుంచి హైదరాబాద్కు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నంలో పట్టుబడ్డారు.

కారు సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ కేబిన్లో స్మగ్లర్లు బంగారాన్ని దాచి ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 5,832.90 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.98 కోట్లు ఉంటుంది. ఈ బంగారాన్ని కస్టమ్స్ చట్టం కింద సీజ్ చేశామని అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande