
రాజన్న సిరిసిల్ల , 13 అక్టోబర్ (హి.స.)రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ప్రతిష్టాత్మక రాజన్న సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సొసైటీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలో ఏకైక విద్యుత్ సహకార సంస్థ అయిన సెస్ పాలకమండలిని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర వ్యూహాల్లో మునిగిపోయాయి.
ఎన్నికల నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరపడుతుండటంతో ఆశావాహులు దరఖాస్తులతో కేంద్రాలకు తరలివస్తున్నారు. డైరెక్టర్ స్థానాల పోటీదారుల ఎంపికపై జిల్లా స్థాయి నేతలు అంతర్గత సమావేశాలు జరుపుతున్నారు. చేనేత, వ్యవసాయ రంగ ఆధారిత వినియోగదారులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో 'సెస్' విజయం స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపనుండటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్