
హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ల ద్వారా సామాన్యులు డబ్బులు కోల్పోతున్న ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక అవగాహన వేదికలను ఏర్పాటు చేసింది. నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాలలో సైబర్ క్రైమ్ నివారణపై శిక్షణా తరగతులు ప్రారంభించింది.
తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలంటూ డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ యాప్ల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు లేదా మోసాలు జరిగితే తక్షణమే '1930' ఉచిత నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, తొలి గంటల వ్యవధిలో ఫిర్యాదు చేస్తే కోల్పోయిన సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్