క్షేత్రస్థాయిలో రైతు భరోసా, రుణమాఫీ లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన లబ్ధి కార్యక్రమాలు అర్హులందరికీ చేరేలా రెవెన్యూ, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు.
Rythu bharosa


హైదరాబాద్ , 13 అక్టోబర్ (హి.స.)వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన లబ్ధి కార్యక్రమాలు అర్హులందరికీ చేరేలా రెవెన్యూ, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు. భూమి రికార్డులలో తప్పులు, ఆధార్ సీడింగ్ సమస్యల వల్ల లబ్ధి పొందని రైతుల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు.

నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల డేటాను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసే పనులు గ్రామ పంచాయతీల వారీగా సాగుతున్నాయి. పారదర్శకంగా అర్హులను గురించడం ద్వారా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం నేరుగా బ్యాంకులు ఖాతాల్లో జమ అయ్యేలా సాంకేతిక లోపాలను సరిదిద్దుతున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande