
ఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను ఢిల్లీ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. దీంతో పోలీసులు వారిని తీహార్ జైలుకు తరలించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా డిమాండ్ చేస్తూ, జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలిపిన వీరిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం వారిని జైలుకు పంపడం జరిగింది.
రాహుల్ గాంధీ ఖండన:
సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో గొంతుకలను అణచివేయాలని చూడటం, నిరసన తెలిపే హక్కును కాలరాయడం కేంద్ర ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ దేశ ప్రజలందరికీ చెందుతుందని పేర్కొంటూ అరెస్ట్లను తీవ్రంగా ఖండించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi