విమానానికి హైజాక్ హెచ్చరికలు.. జైపూర్ లో అత్యవసర ల్యాండింగ్
విమానానికి హైజాక్ హెచ్చరికలు.. జైపూర్ లో అత్యవసర ల్యాండింగ్
Air Plane


జైపూర్ , 14 అక్టోబర్ (హి.స.)

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి తీవ్ర భద్రతా హెచ్చరిక జారీ అయింది. గాల్లో ఉండగా విమానంలో బాంబు ఉందనే బెదిరింపు రావడంతో పాటు హైజాక్ చేయబడినట్లు అనుమానిత సంకేతాలు (Squawk Code 7500) అందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

​ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల సూచన మేరకు పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని దారి మళ్లించి రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. జైపూర్ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా దిగిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి, ప్రయాణికులందరినీ సిబ్బందితో సహా సురక్షితంగా కిందకు దించారు. ప్రస్తుతం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించి, బాంబు స్క్వాడ్ మరియు భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నకిలీ బెదిరింపులకు లేదా భద్రతా అలర్ట్‌కు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande