
ఢిల్లీ , 14 అక్టోబర్ (హి.స.)
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియను సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అవుసుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీలో సీజేపీ నేతల అరెస్టులు, నిరసనల వేడి నేపథ్యంలో, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇప్పటికే రాహుల్ గాంధీ సహా పలువురు ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఒవైసీ కూడా కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించి, దీనికి సంబంధించిన ఇతర పెండింగ్ కేసులతో పాటు జతచేసి విచారిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi