అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం
అల్లూరి సీతారామరాజు, 24 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట గ్రామం వద్ద శనివారం జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొండను
Blasting


అల్లూరి సీతారామరాజు, 24 అక్టోబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట గ్రామం వద్ద శనివారం జరిగిన పేలుడు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొండను తొలిచేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేసిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో సంభవించిన భారీ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పినకోట సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పనుల నిమిత్తం కొండ రాళ్లను పగలగొట్టడానికి పనుల నిర్వాహకులు జిలెటిన్ స్టిక్స్ (డిటోనేటర్లు) అమర్చి బ్లాస్టింగ్ ప్రక్రియను చేపట్టారు. అయితే, సరిగ్గా పేలుడు జరిగే క్షణంలోనే ఆ మార్గంలో ఒక టిప్పర్ వాహనం ఎదురుగా వచ్చింది. పేలుడు దాటికి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మరియు రాళ్ల తాకిడికి టిప్పర్ వాహనం గాల్లోకి ఎగిరిపడి తీవ్రంగా ధ్వంసమైంది.

ఈ ఘోర ప్రమాదంలో టిప్పర్ లోపల, పరిసరాల్లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు (టీచర్), టిప్పర్ డ్రైవర్, ముగ్గురు రోడ్డు పనుల కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అనంతగిరి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande