
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని పలు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నేటి నుంచి పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
చీరాల పరిధిలోని వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లకు పర్యాటకులు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఉధృతమయ్యే అవకాశం ఉండటం, తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారే ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సముద్ర తీరంలో విహరించేందుకు వచ్చే ప్రజలు, పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బాపట్ల జిల్లా బీచ్‌లకు పర్యటన కోసం రావాలని భావిస్తున్నవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. తదుపరి అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు బీచ్‌లలో పర్యాటకులకు అనుమతి ఉండదని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్