
విజయనగరం , 27 అక్టోబర్ (హి.స.)
విజయనగరం నగరంలో ప్రసిద్ధ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేడు వైభవంగా జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభం కానుండటంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.
సిరిమానోత్సవానికి సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, జనసందోహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా సుమారు 3,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, భక్తుల కదలికలను నియంత్రించేందుకు పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో విధుల్లో నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్