దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Weather update


అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)

దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, రేపటికి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కనిపించనుంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేడు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 24.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అధికారుల సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande