
అమరావతి , 30 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు భారీ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ రెండో విడత కింద రూ. 3,125 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46.85 లక్షల రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. విడుదలైన మొత్తం నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 782.55 కోట్లుగా ఉంది. ఇటీవల 'అర్నాబ్' తుపాను వల్ల తీరప్రాంత రైతులకు భారీ నష్టం వాటిల్లిన తరుణంలో, ఈ పెట్టుబడి సాయం వ్యవసాయ పనులకు మరియు పంటల రక్షణకు ఎంతో ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు.
ప్రభుత్వం డిజిటల్ విధానంలో బటన్ నొక్కి నేరుగా డిబిటి (DBT) ద్వారా ఈ నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఏర్పాట్లను పూర్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్