
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
సామాజిక విప్లవంతో పాటు ఆర్థిక విప్లవానికి కూడా శ్రీకారం చుట్టిన మహనీయురాలు ఇందిరా గాంధీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు.
ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహం వద్ద నేడు మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బ్యాంకుల జాతీయకరణ వంటి చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆమె ఆర్థిక భరోసా కల్పించారని పేర్కొన్నారు.
ఆమె తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశంలో హరిత విప్లవానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి మార్గం సుగమం చేశాయని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు