
అమరావతి , 01 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో, ప్రజల భద్రతే ముఖ్యమని భావించిన సీఎం చంద్రబాబు రేపు చేపట్టాల్సిన తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని అమరావతిలోనే ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన నిర్ణయించారు.
సమీక్ష సమావేశంలో భాగంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు మరియు ఆర్టీజీఎస్ విభాగాలను సీఎం అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi