రాష్ట్రంలో 17% పెరిగిన నీటి వనరులు ..... జల్శక్తి శాఖ కీలక గణాంకాలు
రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగింది. 2017-18 సంవత్సరం ఆధారంగా నిర్వహించిన మొదటి సర్వేతో పోలిస్తే రెండో సర్వేలో ఇవి పెరిగినట్లు తేలింది.
TB Dam


అమరావతి , 04 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగింది. 2017-18 సంవత్సరం ఆధారంగా నిర్వహించిన మొదటి సర్వేతో పోలిస్తే రెండో సర్వేలో ఇవి పెరిగినట్లు తేలింది.

మొదటి సర్వేలో వీటి సంఖ్య 1,90,777 ఉండగా రెండో సర్వేలో 2,23,314 ఉంది. ఇందులో 7,643 నీటి వనరులు ఆక్రమణల్లో ఉన్నాయి. 2023-24 లెక్కల ఆధారంగా రూపొందించిన రెండో సర్వే గణాంకాల నివేదికను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ రోజు పత్రికా ప్రకటన ద్వార అధికారికంగా విడుదల చేశారు.

పెరిగిన జల వనరుల సంఖ్య

నివేదికలోని వివరాల ప్రకారం, మొదటి గణాంక సర్వే సమయంలో రాష్ట్రంలో 1,90,777 నీటి వనరులు ఉండగా, రెండో సర్వే నాటికి ఆ సంఖ్య 2,23,314 కు చేరింది. అయితే వీటిలో 7,643 నీటి వనరులు ఆక్రమణలకు గురైనట్లు సర్వే గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,76,890 నీటి వనరులు ప్రజల నిత్య అవసరాలు, వ్యవసాయానికి పూర్తి వినియోగంలో ఉన్నాయి. మొదటి సర్వేతో పోలిస్తే వినియోగంలో ఉన్న వనరుల సంఖ్యలో 18 శాతం పెరుగుదల కనిపించడం శుభపరిణామం. మొత్తం జల వనరుల్లో దాదాపు 49.48 శాతం ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల అధీనంలో ఉన్నట్లు లెక్కలు తేల్చాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం

రాష్ట్రంలోని నీటి వనరులలో సింహభాగం గ్రామీణ ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి. మొత్తం వనరుల్లో ఏకంగా 99.68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండగా, పట్టణ ప్రాంతాల్లో వీటి వాటా కేవలం 0.32 శాతంగా మాత్రమే ఉంది. వర్గీకరణ పరంగా చూస్తే, ఇందులో అత్యధికంగా 60.33 శాతం చెరువుల రూపంలో ఉండగా, 28.72 శాతం నీటి సంరక్షణ కుంటల రూపంలో ఉన్నాయి. రాష్ట్రంలోని 45,128 ప్రధాన జల వనరుల ఆధారంగా దాదాపు 18,52,520 హెక్టార్ల భారీ ఆయకట్టు సాగులోకి వస్తున్నట్లు కేంద్ర నివేదిక పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande