విభిన్న చిత్రాలు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు: మంత్రి లోకేశ్
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు.
Lokesh


అమరావతి, 04 అక్టోబర్ (హి.స.) ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు.

ఆయన మృతిపై ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా తాతయ్య ఎన్టీఆర్ గారు, బాలా మామయ్యలతో కలిసి పనిచేసి అనేక అద్భుతమైన చిత్రాలను అందించారు’.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande