సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ ప్రయోగాలకు, అద్భుత దృశ్యకావ్యాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరన్న వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, చిత్ర నిర్మాణ సంస్థలు తీవ్ర సంత
పవన్ కల్యాణ్


అమరావతి, 04 అక్టోబర్ (హి.స.)భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణ ప్రయోగాలకు, అద్భుత దృశ్యకావ్యాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరన్న వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, చిత్ర నిర్మాణ సంస్థలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సింగీతం మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande