
హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం
సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్. స్టీఫెన్సన్ సుప్రీంకోర్టు లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, తనకూ అదనపు వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని స్టీఫెన్సన్ ఈ పిటిషన్లో కోరారు. స్టీఫెన్సన్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను భారత ప్రధాన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్లోని అంశాలను పరిశీలించిన సీజేఐ ధర్మాసనం..
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన శాసనమండలి (MLC) ఎన్నికల సమయంలో ఈ 'ఓటుకు నోటు' ఉదంతం వెలుగులోకి వచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ను తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ.. రేవంత్ రెడ్డి భారీగా నగదు ఆశ చూపారనే ఆరోపణలతో పాటు లావాదేవీలకు సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు