ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రియాంక గాంధీ ఆగ్రహం
ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించాడు . ఇవాళ ఆమె ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. తాజా పరిణామాలు మన రాజ్యాంగానికి, ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు.
Priyanka Gandhi

న్యూఢిల్లీ, 05 అక్టోబర్ (హి.స.)

ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించాడు . ఇవాళ ఆమె ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. తాజా పరిణామాలు మన రాజ్యాంగానికి, ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం వంటి చర్యలు మన రాజ్యాంగ స్ఫూర్తికి, ఎన్నికల వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటివని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికలను పద్ధతి ప్రకారం తారుమారు చేస్తున్నారనే విషయం ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande